Sero Survey: కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ముంబైకు చెందిన బీవైఎల్ నాయర్ హాస్పిటల్, కస్తూర్బా ల్యాబ్ ఈ సెరో సర్వే నిర్వహించింది.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన సెరో సర్వేలో 50 శాతం మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. ముంబైలోని 24 వార్డుల్లో మే, జూన్ నెలల్లో 6 నుంచి 18 ఏళ్ల వయసున్న వారి నమూనాలను ఈ సర్వే కోసం సేకరించారు. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
10 వేల మంది పిల్లలకు సంబంధించిన నమూనాలను సర్వే కోసం సేకరించారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ముంబైకు చెందిన బీవైఎల్ నాయర్ హాస్పిటల్, కస్తూర్బా ల్యాబ్ ఈ సెరో సర్వే నిర్వహించింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 6
ఈ సర్వే ఆధారంగా దాదాపు 50 శాతం మంది పిల్లలు కరోనా బారిన పడి కోలుకున్నట్టు తేలింది. 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వాళ్లు సుమారుగా 53.43 శాతం కరోనా బారిన పడినట్టు సెరో సర్వేలో వెల్లడైంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
1 నుంచి 4 ఏళ్ల వయసున్న వాళ్లు 51.04 శాతం మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసున్న వాళ్లు 47,33 శాతం మంది, 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వాళ్లు 53.43 శాతం మంది, 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్లు 51.39 శాతం మంది కరోనా బారిన పడ్డారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
మొత్తంగా 1 నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్లు 51.18 శాతం మంది కరోనా బారిన పడ్డారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
మార్చి 2021తో పోలిస్తే ఈసారి నిర్వహించిన సెరో సర్వేలో పిల్లల్లో ఎక్కువ పాజిటివిటీ రేటు కనిపించిందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.(ఫ్రతీకాత్మక చిత్రం )