Corona Nasal Vaccine: కరోనా వైరస్‌ను అరికట్టడానికి రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న వారికి బూస్టర్ డోస్‌గా ముక్కులో చుక్కల మందు తీసుకోవచ్చని సూచిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇవిగో డిటెయిల్స్
చైనాలో కరోనా మళ్లీ కరాళనృత్యం చేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది.ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరి చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 10
వైరస్ వ్యాప్తి చెందకుండా అన్నీ రాష్ట్రాల వైద్య, ఆరోగ్యశాఖలకు కేంద్రం పలు సూచనలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కొత్త విషయాలను వెల్లడించింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కోవిడ్ టెస్టులను తప్పని సరి చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 10
కరోనా వైరస్‌ను అరికట్టడానికి రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న వారికి బూస్టర్ డోస్‌గా ముక్కులో చుక్కల మందు తీసుకోవచ్చని సూచిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 10
హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ని బూస్టర్ డోస్‌గా ముక్కులో వేసుకోవచ్చని ..ఇందుకోసం కోవిన్ యాప్‌లో శుక్రవారం నుంచి నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు కేంద్రమంత్రి. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 10
ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ డ్రాప్స్‌ని ముందుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండనుంది. శుక్రవారం నుంచి కోవిడ్ టీకాల కార్యక్రమంలో ఈ కోవిడ్ ముక్కులో మందుల చుక్కలను చేర్చనున్నట్లుగా అధికారవర్గాలు తెలిపాయి. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 10
గతంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగానే ఇప్పుడు నాసిల్ డ్రాప్స్ వేసుకోవచ్చంటోంది కేంద్రం. అధికారికంగా ఎవరైనా తీసుకునేందుకు వీలుంటుంది. టీకా సర్టిఫికేషన్ కూడా యాప్ నుంచి తీసుకోవడం సులభమవుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 10
కరోనా మొదటి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కు అర్హులు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారు అవే కంపెనీ బూస్టర్ టీకాలు తీసుకోవచ్చు. వాటికి బదులు నాసల్ టీకాను కూడా తీసుకోవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 10
ఈ కోవిడ్ నాసిల్ డ్రాప్స్ తీసుకునే వాళ్ల వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలని కేంద్రం ప్రకటించింది. ఎలాంటి సూదులు అవసరం లేని నాసల్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
9/ 10
ఇండియాలో కరోనా వైరస్‌కు కోవాగ్జిన్, కొవిషీల్డ్, కోవోవ్యాక్స్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ కార్బోవ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందు కూడా అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మకచిత్రం)
10/ 10
అయితే ఇప్పటి వరకు టీకాల రూపంలో తీసుకున్న వ్యాక్సిని స్థానంలోనే ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందుబాటులోకి వస్తోంది. కరోనా నాసిల్ వ్యాక్సిన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అతి త్వరలోనే అందరికి లభించనున్నట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.(ప్రతీకాత్మకచిత్రం)