ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కరోనా కేసులు కాస్త తగ్గినట్లే కనిపించినా.. పరిస్థితి మాత్రం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు ఒమిక్రాన్.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 200 లోపు రోజువారీ కేసులు నమోదవుతుండగా.. తాజాగా ఈ సంఖ్య భారీగా పెరిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 28,311 టెస్టులు నిర్వహించగా... 334 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యధికంగా చెప్పవచ్చు. ఏకంగా 9 జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్ కు చేరింది. కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 29, చిత్తూరు జిల్లాలో 55, తూర్పుగోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 39, కడప జిల్లాలో 04, కృష్ణాజిల్లాలో 50, కర్నూలు జిల్లాలో 07, నెల్లూరు జిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 04, శ్రీకాకుళం జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో 80, విజయనగరం జిల్లాలో 04, పశ్చిమగోదావరి జిల్లాలో 16 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. (ప్రతీకాత్మకచిత్రం)
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 95 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,93,731 మంది కోలుకున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 306 యాక్టివ్ కేసులున్నాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 22 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)