ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 21,010 టెస్టులు నిర్వహించగా... 108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోనూ 50 లోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో పదిలోపే కొత్త కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కేసులు నమోదుకాగా.. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు.
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 03, చిత్తూరు జిల్లాలో 36, తూర్పుగోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 06, కడప జిల్లాలో 04, కృష్ణాజిల్లాలో 05, కర్నూలు జిల్లాలో 00, నెల్లూరు జిల్లాలో 05, ప్రకాశం జిల్లాలో 07, శ్రీకాకుళం జిల్లాలో 03, విశాఖపట్నం జిల్లాలో 20, విజయనగరం జిల్లాలో 00, పశ్చిమగోదావరి జిల్లాలో 02 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. (ప్రతీకాత్మకచిత్రం)
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 141 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,878 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,93,211 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలోనే అత్యధికంగా 427 యాక్టివ్ కేసులున్నాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 21, 010 టెస్టులతో కలిపి ఇప్పటివరకు 3,07,98,406 టెస్టులు నిర్వహించింది. గతంలో రోజుకు 50వేలకు పైగా టెస్టులు నిర్వహించిన ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంతో ప్రస్తుతం రోజుకు 30వేల టెస్టుల వరకు నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం) (image credit - reuters)