జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 272, తూర్పుగోదావరి జిల్లాలో 206, గుంటూరు జిల్లాలో 132, కడప జిల్లాలో 60, కృష్ణాజిల్లాలో 162, కర్నూలు జిల్లాలో 05, నెల్లూరు జిల్లాలో 201, ప్రకాశం జిల్లాలో 120, శ్రీకాకుళం జిల్లాలో 28, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 09, పశ్చిమగోదావరి జిల్లాలో 129 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.
గడచిన 24 గంటల్లో 1,296 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,797గా ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య వంద లోపే ఉంది. విజయనగరంలో 115, శ్రీకాకుళంలో 239, విశాఖపట్నంలో 402 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 2,502, ప్రకాశం జిల్లాలో 2500 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం) (image credit - Reuters)
ఇప్పటివరకు రాష్ట్రంలో 2,75,96,989 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజుకు సగటున 50వేల నుంచి 60వేల టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరికైనా చిన్నపాటి లక్షణాలున్న ఆరోగ్య సిబ్బంది ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)