కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
రాష్ట్రంలోని పేదలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది మే, జూన్ రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం అందించనుంది.
కేంద్రం ప్రభుత్వం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది.
కేంద్రం మొత్తం 88 లక్షల మందికే ఉచిత రేషన్ ఇవ్వనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 59 లక్షల మందికి కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వనుంది.
కరోనా సమయంలో పేదలకు అండగా ఉండేందుకే ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
...