ANDHRA PRADESH GOVERNMENT RELEASED LIST OF COVID HOSPITALS AND ICU BEDS AVAILABLE IN THE STATE FULL DETAILS HERE PRN
Covid Hospitals in AP: ఏపీలో కరోనా ఆస్పత్రులు, ఐసీయూ బెడ్స్ వివరాలు ఇవిగో...
ఏపీలో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తోంది. పేషెంట్లతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా ఆస్పత్రులు కరోనా పేషెంట్స్ తో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది కొవిడ్ ఆస్పత్రుల సమాచారంపై ఒకింత గందరగోళం నెలకొంది.
2/ 18
ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని ఆస్పత్రులున్నాయి. ఎక్కడ ఎన్ని బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనేది కూడా ప్రజలకు తెలియడం లేదు.
3/ 18
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులు, బెడ్లు, వెంటిలేటర్లకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.
4/ 18
ప్రస్తుతం రాష్ట్రంలో 155 కొవిడ్ ఆస్పత్రులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే అనంతపురం జిల్లాలో 8 ఆస్పత్రుల్లో 137 ఐసీయూ బెడ్స్ ఉండగా 125 ఖాళీగా ఉన్నాయి.
5/ 18
చిత్తూరు జిల్లాలో 24 కొవిడ్ ఆస్పత్రుల్లో 421 ఐసీయూ బెడ్స్ ఉండగా అందులో 253 ఖాళీగా ఉన్నాయి.
6/ 18
తూర్పుగోదారి జిల్లాలోని 3 కొవిడ్ ఆస్పత్రుల్లో 78 ఐసీయూ బెడ్స్ కి గానూ.. 59 ఖాళీగా ఉన్నాయి.
7/ 18
గుంటూరు జిల్లాలోని 43 కొవిడ్ ఆస్పత్రుల్లో 154 ఐసీయూ బెడ్స్ ఉండగా.. అందులో 105 ఖాళీగా ఉన్నాయి.
8/ 18
కృష్ణాజిల్లాలో 15 కొవిడ్ ఆస్పత్రులో 249 ఐసీయూ బెడ్స్ కి గానూ.. 106 ఖాళీగా ఉన్నాయి.
9/ 18
కర్నూలు జిల్లాలో 11 ఆస్పత్రుల్లో 225 ఐసీయూ బెడ్స్ కి గానూ.. 199 ఖాళీగా ఉన్నాయి.
10/ 18
ప్రకాశం జిల్లాలో 15 ఆస్పత్రుల్లో 187 ఐసీయూ బెడ్స్ కి గానూ 110 ఖాళీగా ఉన్నాయి.
11/ 18
నెల్లూరు జిల్లాలోని 7 కొవిడ్ ఆస్పత్రుల్లో 227 ఐసీయూ బెడ్లకు గానూ 164 ఖాళీగా ఉన్నాయి.
12/ 18
శ్రీకాకుళం జిల్లాలోని 3 ఆస్పత్రుల్లో 166 ఐసీయూ బెడ్లకు గానూ 70 ఖాళీగా ఉన్నాయి.
13/ 18
విశాఖపట్నం జిల్లాలోని 6 కొవిడ్ ఆస్పత్రుల్లో 163 ఐసీయూ బెడ్లకు గానూ.. 48 ఖాళీగా ఉన్నాయి.
14/ 18
విజయనగరం జిల్లాలోని 8 ఆస్పత్రుల్లో 125 ఐసీయూ బెడ్లు ఉంటే.. 93 ఖాళీగా ఉన్నాయి.
15/ 18
పశ్చిమగోదావరి జిల్లాలోని 7 కొవిడ్ ఆస్పత్రుల్లో 64 ఐసీయూ బెడ్లు ఉంటే.. 63 ఖాళీగా ఉన్నాయి.
16/ 18
వైఎస్ఆర్ కడప జిల్లాలోని 5 కొవిడ్ ఆస్పత్రుల్లోని 122 ఐసీయూ బెడ్లకు గానూ.. 105 ఖాళీగా ఉన్నాయి.
17/ 18
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,318 ఐసీయూ బెడ్స్ ఉండగా.. అందులో 808 బెడ్స్ ఇప్పటికే ఫిల్ అయ్యాయి. 1510 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
18/ 18
ఐతే ఈ ఆస్పత్రులు, బెడ్ల సంఖ్య పేషెంట్ల రాక, అదనపు బెడ్ల పెంపు ఆదారంగా పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.