ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారిపై రాష్ట్రప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రత్యేక వైద్య బృందాల సాయంతో వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో అతనికి ఒమిక్రాన్ నిర్ధారించే టెస్ట్ నిర్వించారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురికి కూడా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇప్పటికే భారత దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 మార్క్ ను క్రాస్ చేసింది. మరికొద్ది మంది శాంపిల్స్ రావాల్సి ఉంది. అన్నికంటే ముఖ్యంగా విదేశాల నుంచి మన దేశంలో వివిధ రాష్ట్రాలకు చేరుకున్న వారిలో చాలామంది అడ్రస్ దొరకడం లేదు. వారి ఫోన్ లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండడం అందోళన పెంచుతోంది. అందులో ఎంతమందికి వైరస్ ఉంది. అన్నది తెలీదు.. వారంత ఎక్కడ ఉన్నారు. ఎవరెవరితో కలుస్తున్నారు అన్నది తెలియడం లేదు. అందులో కొందరికి ఒమిక్రాన్ ఉన్నా.. జెట్ స్పీడ్ వేగంతో ఇతరులకు సోకీ అవకాశం ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)