ఐతే ఈ ఏడాది మే నెల తర్వాత క్రమంగా సడలింపులిస్తూ వస్తోంది. తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు.. ఆ తర్వాత సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను రాత్రికే పరిమితం చేసింది. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు తగ్గేవరకు కఠిన లాక్ డౌన్ విధించారు. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తోంది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. వినాయక చవితి వంటి పండుగల సమయంలోనూ కర్ఫ్యూ అమలైంది. కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తుండటంతో సడలింపుల సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)