AP COVID Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పూర్తిగా శాంతించి అని అంతా ఊపిరి పీల్చుకుంటున్నాం.. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కలిపితే గత కొన్ని రోజులుగా చూసుకుంతే రెండు వందల లోపే కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు నిన్న రాష్ట్రంలో ఒక్క మరణం నమోదు కాలేదు. గత ఐదు రోజుల పరిస్థితి చూసుకున్నా.. ఒకటి రెండు మరణాలే నమోదయ్యాయి..
ఆ భయాలు ఎలా ఉన్నా.. ఓవరాల్ గా నమోదైన కేసుల సంఖ్య మాత్ర కాస్త తక్కవగానే ఉంది. ఇవాళ నమోదైన 178 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20లక్షల 72వేల 624కి చేరుకుంది. ఏపీలో మొత్తం కరోనాతో 14,438 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2వేల 140 కేసులు యాక్టివ్గా ఉండగా.. కరోనా నుంచి 20లక్షల 56వేల 46 మంది బాధితులు కోలుకున్నారు.