గత 24 గంటల్లో 1, 05,494 సాంపిల్స్ పరిశీలించగా.. 22 వేల 164 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. గడిచిన 24 గంటల్లో 18 వేల 832 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో 1, 73,67,935 మందికి పరీక్షలు నిర్వహించారు.
జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 2,039, చిత్తూరు జిల్లాలో 2,169, తూర్పుగోదావరి జిల్లాలో 2,844, గుంటూరు జిల్లాలో 2,099, కడప జిల్లాలో 1,267, కృష్ణాజిల్లాలో 1,240, కర్నూలు జిల్లాలో 1,568, నెల్లూరు జిల్లాలో 1,574, ప్రకాశం జిల్లాలో 980, శ్రీకాకుళం జిల్లాలో 1,432, విశాఖపట్నం జిల్లాలో 2,206, విజయనగరం జిల్లాలో 998 , పశ్చిమగోదావరి జిల్లాలో 1,748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కారణంగా గుంటూరులో 12 మంది, విజయనగరంలో పదకొండు, విశాఖపట్నంలో పది మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూల్ లో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరులో ఐదురుగు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు కరోనా కారణంగా మరణించారు.
ఓ వైపు వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. మరోవైపు జిల్లాల వారిగా అధిక కేసులు ఉన్న ప్రదేశాలను గుర్తించి కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ అమలు అవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటలకు 144 సెక్షన్ అమల్లో ఉంది. అయినా కరోనా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. కేసులు రెట్టింపు అవుతూనే ఉండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.