ఏపీలో గడచిన 24 గంటల్లో 94వేల 595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా 662 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ప్లేస్ లో చిత్తూరు జిల్లా ఉంది. గడిచిన 24 గంటల్లో 473 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3వేల 692 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఏపీ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గడం.. రికవరీలు పెరుగుతుండటంతో ఊరటనిస్తోంది. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 137, చిత్తూరు జిల్లాలో 473, తూర్పుగోదావరి జిల్లాలో 662, గుంటూరు జిల్లాలో 215, కడప జిల్లాలో 181, కృష్ణాజిల్లాలో 210, కర్నూలు జిల్లాలో 59, నెల్లూరు జిల్లాలో 235, ప్రకాశం జిల్లాలో 322, శ్రీకాకుళం జిల్లాలో 79, విశాఖపట్నం జిల్లాలో 142, విజయనగరం జిల్లాలో 142, పశ్చిమగోదావరి జిల్లాలో 398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. తొమ్మి జిల్లాల్లో రాత్రి 9 వరకు సడలింపులు ఇవ్వగా.. పాజిటివ్ శాతం 5 కంటే ఎక్కువ ఉన్న మిగితా నాలుగు జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి ఇస్తున్నారు. తరువాత కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంతో పూర్తిగా కరోనా కట్టడిలోకి వస్తోంది. అయతే కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వహిస్తే.. ప్రమాదం పొంచే ఉంటుంది..