AP Corona: ఏపీ ప్రజలకు భారీ ఊరట... థర్డ్ వేవ్ పై ముందే అప్రమత్తమైన సర్కార్

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితమిస్తోంది. పాజిటివ్ రేటు బాగా తగ్గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.