దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ సునామీని తపిస్తోంది. రోజువారీ కేసులు నాలుగు లక్షలకు, మరణాలు వెయ్యికి చేరువయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20లక్షలు దాటేసింది. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులోనైతే పరిస్థితి చేయిదాటే దశకు చేరింది. దీంతో స్టాలిన్ సర్కారు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వివరాలివి..
తమిళనాడులో కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి గరిష్ట స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2/ 7
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని ముఖ్య మంత్రి స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్న నేపథ్యంలోనే జనవరి 23న రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నామని తెలిపారు.
3/ 7
కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ప్రజలే కరోనా నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్క్, భౌతిక దూరం వంటి నియమాలను పాటించాలని సీఎం స్టాలిన్ సూచించారు. ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్లను కూడా తీసుకోవాలని అభ్యర్థించారు.
4/ 7
తమిళనాడులో ప్రతి రోజు దాదాపు 30 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. గురువారం కూడా 28,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
5/ 7
మరోవైపు.. వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ మాత్రం యథావిధిగా అమల్లో ఉండనుంది. హాస్పిటల్లో చేరికలు పెరిగితే.. తక్షణమే ఆంక్షల్ని తిరిగి అమలు చేస్తామని సర్కారు తెలిపింది.
6/ 7
దేశ రాజధాని ఢిల్లీలోనూ వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపాదించగా.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తిరస్కరించారు. పరిస్థితి మెరుగుపడే వరకు ప్రస్తుతమున్న ఆంక్షల్ని ఇలానే కొనసాగించాలని స్పష్టం చేశారు.
7/ 7
కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నందు వల్ల 64 గంటలపాటు లాక్డౌన్ అమలు చేయాలని జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం నిర్ణయించింది. ఇక్కడ గురవారం ఒక్కరోజే 5,992 కేసులు వెలుగు చుశాయి. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.