అధ్యయనం ప్రకారం వాసన, రుచి నేరుగా మన మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి. ప్రజలు ఈ రకమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు, వారి జీవన నాణ్యత ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఈ సమస్య మన దైనందిన జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఈ అధ్యయనంలో చాలా మంది రోగులు 6 నెలల్లో కరోనా యొక్క ఈ దుష్ప్రభావం నుండి కోలుకున్నారని తేలింది.
భారత్ లో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత నాలుగు రోజులుగా రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (ఆగస్టు 8, సోమవారం) వెల్లడించిన గణాంకాల వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2,63,419 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 16,167 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,41,61,899కు చేరాయి. ఇప్పటిదాకా జరిపిన టెస్టుల సంఖ్య 87.81 కోట్లకు చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)