99 PERCENT PATIENTS RECOVERING FROM CORONAVIRUS IN INDIA ONLY 1 12 PERCENT DEATH RATE NOW BA
Good News: కరోనా సునామీ సమయంలో ప్రజలకు, పేషెంట్లకు ఓ గుడ్ న్యూస్..
కరోనా పెషెంట్లకు, ప్రజలకు ఓ చిన్న గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ మొదటి దశ కంటే కూడా భయంకరంగా ఉన్నప్పటికీ.. సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన వారిలో 99 శాతం మంది కోలుకుంటున్నారు.
ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా ఒకటే చర్చ. కరోనా, కరోనా. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కరోనా గురించే చర్చించుకుంటున్నారు. కరోనా మొదటి దశ కంటే సెకండ్ వేవ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. దేశంలో తాజా లెక్కల ప్రకారం 3.5 లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా పేషెంట్ల గురించి, ఆక్సిజన్ కొరత గురించి, చనిపోయిన వారి అంత్యక్రియలకు సంబంధించి ఇలా అన్నీ హృదయవిదారక దృశ్యాలు, సమాచారాలే కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఇలాంటి సమయంలో కరోనా పెషెంట్లకు, ప్రజలకు ఓ చిన్న గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ మొదటి దశ కంటే కూడా భయంకరంగా ఉన్నప్పటికీ.. సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన వారిలో 99 శాతం మంది కోలుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు 1.12 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మిగిలిన వారంతా కూడా కరోనా వైరస్ బారిన పడినా కూడా అంతా కోలుకుంటున్నారు. కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకుంటున్నారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో 85 శాతం నుంచి 90 శాతం వరకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆస్పత్రిలో చేరిన వారిలో కూడా 30 శాతం మంది కంటే తక్కువ మందికే వెంటిలేటర్లు అవసరం అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)