జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 108, తూర్పుగోదావరి జిల్లాలో 42, గుంటూరు జిల్లాలో 68, కడప జిల్లాలో 14, కృష్ణాజిల్లాలో 88, కర్నూలు జిల్లాలో 04, నెల్లూరు జిల్లాలో 38, ప్రకాశం జిల్లాలో 44, శ్రీకాకుళం జిల్లాలో 09, విశాఖపట్నం జిల్లాలో 41, విజయనగరం జిల్లాలో 02, పశ్చిమగోదావరి జిల్లాలో 30 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.
కరోనా సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కరోనాపై అధికారిక సమాచారం కోసం 8297104104 నెంబర్ కు వాట్సాప్ ద్వారా Hi, Hello, Covid అని మెసేజ్ చేస్తే డాక్టర్లు స్పందిస్తారు. స్మార్ట్ ఫోన్ లేనివారు 8297104104 ఫోన్ చేసి IVRS ద్వారా కరోనా సాయం పొందవచ్చు. నేరుగా 104కి కూడా కాల్ చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)