1. జొమాటో ఐపీఓకి అప్లై చేసిన ఇన్వెస్టర్లు ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ఈ రోజే షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. జొమాటో ఐపీఓ సబ్స్క్రిప్షన్ జూలై 16న ముగిసింది. ఈ ఐపీఓ 38 రెట్లు సబ్స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. జూలై 22న షేర్ల అలాట్మెంట్ ఉంటుందని ముందే ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఈరోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)