1. ఏప్రిల్ 1 నుంచి ఒక్క ఢిల్లీ తప్ప దేశమంతా పాత వాహనాల రీరిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. 15 ఏళ్ల కన్నా పాత వాహనాలన్నింటికీ ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. 15 ఏళ్ల కన్నా ముందు వాహనాలన్నింటినీ మీరు రీరిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఎనిమిది రెట్లు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త రూల్స్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలంటే టూవీలర్‌కు రూ.300, కారుకు రూ.600, ట్యాక్సీలకు రూ.1,000 బస్సులకు రూ.1,500 చొప్పున చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు దాటిన వాహనాలకు కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి టూవీలర్‌కు రూ.1,000, కారుకు రూ.5,000, ట్యాక్సీలకు రూ.7,000 బస్సులకు రూ.12,500 చొప్పున చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రీరిజిస్ట్రేషన్ ఆలస్యం చేస్తే నెలకు రూ.3,000 చొప్పున అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు నెలకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి. నియమనిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన ప్రతీ వాహనాన్ని ఐదేళ్లకు ఓసారి రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి 15 ఏళ్ల కన్నా పాత వాహనాలు వాడుతున్నవారికి అదనపు ఛార్జీల భారం తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఈ నియమనిబంధనలకు మినహాయింపు ఉంది. ఇప్పటికే ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను డీరిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి ఢిల్లీకి ఈ నియమనిబంధనలు వర్తించవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త నియమనిబంధనలు అమల్లోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ ఛార్జీలతో పాటు పాత రవాణా, కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్ ఖర్చులు కూడా పెరగనున్నాయి. కమర్షియల్ వాహనాలు 8 ఏళ్లు దాటితే కొత్త ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇంత భారీగా ఛార్జీలు పెంచడానికి కారణం కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను తగ్గించడమే. ఈ ఛార్జీలు పెరిగిపోవడంతో వాహనదారులు తమ పాత వాహనాలను స్క్రాప్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారతదేశంలో స్క్రాప్ చేయాల్సిన వాహనాల సంఖ్య కోటికి పైగా ఉంటాయని అంచనా. కార్ ఓనర్లు తమ పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. పాతవాహనాలను స్క్రాప్ చేసినవారిలో ఎక్కువ మంది కొత్త వాహనాలను కొంటారు. పాత వాహనాలతో పోలిస్తే కొత్త వాహనాలు తక్కువ కాలుష్యం వెదజల్లుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మరోవైపు ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఫోర్ వీలర్లు, ఇతర వాహనాలకు ఈ సబ్సిడీ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)