ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..
New Wage Rules: ఉద్యోగికి టేక్ హోమ్ శాలరీ తక్కువ వస్తుంది. అదే సమయంలో కంపెనీ మీద కూడా కొంచెం భారం పడుతుంది. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగికి చెల్లించాల్సిన పీఎఫ్ 10 శాతం నుంచి 12 శాతానికి పెరుగుతుంది.
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు టేమ్ హోమ్ శాలరీ తగ్గబోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన నిబంధనలను తీసుకొచ్చిన తరుణంలో కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీలను సవరించనున్నాయి.
2/ 6
కేంద్రం తెచ్చిన ‘కోడ్ ఆన్ వేజెస్ 2019’ 2021 ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్) నుంచి అమల్లోకి రానుంది. కొత్త రూల్స్ ప్రకారం అలవెన్స్ అనేది ఉద్యోగి వేతనంలో 50 శాతానికి మించకూడదు.
3/ 6
ఓ రకంగా చెప్పాలంటే కంపెనీలు ఉద్యోగికి ఇచ్చే బేసిక్ శాలరీ కనీసం 50 శాతం ఉండాలి. బేసిక్ శాలరీ పెరిగితే దానికి తగినట్టు పీఎఫ్ ఇతర డిడక్షన్స్ ఉంటాయి. అంటే, టేక్ హోమ్ శాలరీ మాత్రం తగ్గిపోతుందన్నమాట. అయితే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయి.
4/ 6
ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలన్నీ నాన్ అలవెన్స్‌ను 50 శాతం కంటే తక్కువగా ఉంచుతాయి. అలవెన్స్‌ను ఎక్కువ మొత్తంలో ఉంచుతాయి. కాబట్టి, కొత్త రూల్స్ ప్రకారం అలవెన్సుల రూపంలో ఎక్కువ వేతనాలు పొందేవారి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది.
5/ 6
ఉద్యోగికి టేక్ హోమ్ శాలరీ తక్కువ వస్తుంది. అదే సమయంలో కంపెనీ మీద కూడా కొంచెం భారం పడుతుంది. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగికి చెల్లించాల్సిన పీఎఫ్ 10 శాతం నుంచి 12 శాతానికి పెరుగుతుంది.
6/ 6
కోడ్ ఆఫ్ వేజెస్‌ను పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. ప్రజల నుంచి స్పందనను తీసుకున్న తర్వాత ఫైనల్ రూల్స్‌ను కేంద్రం కొత్తగా నోటిఫై చేస్తుంది.