ప్రజలు సరైన అవగాహన లేక, ప్రాధాన్యం అర్థం కాక చాలా రకాల సేవలను కోల్పోతుంటారు. అలాంటి వాటిల్లోకి ఏటీఎం(ATM) కార్డు ప్రయోజనాలు కూడా వస్తాయి. ఎలాగంటారా? మీకు ఏటీఎం కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance) పొందవచ్చనే విషయం తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
* ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సైతం బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి దాదాపు ఏటీఎం కార్డు ఉండే ఉంటుంది. డబ్బుల కోసం బ్యాంకులో అధిక సమయం పాటు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఏటీఎం కార్డు ద్వారా త్వరగా డబ్బును పొందవచ్చు. అదే విధంగా క్రెడిట్, డెబిట్ కార్డుల(Credit, Debit cards) ద్వారా షాపింగ్ చేస్తే డిస్కౌంట్లను పొందే అవకాశాన్ని కూడా షాపింగ్‌మాల్స్ కల్పిస్తాయి.
* ట్రాన్సాక్షన్లను బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ
బ్యాంకులు యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్(Accidental Hospitalisation), యాక్సిడెంటల్ డెత్ కవరేజ్‌ని(Accidental Death Coverage) ఖాతాదారులకు అందజేస్తున్నాయి. ఏటీఎం కార్డు వేరియంట్, కస్టమర్ టూ కస్టమర్ ట్రాన్సాక్షన్‌ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* యాక్సిడెంట్లో మరణిస్తే?
ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం బారిన పడి వ్యక్తి మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రం(డెత్ సర్టిఫికెట్) సమర్పించాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్, బాధితుడి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. గత రెండు నెలలు లేదా 60 రోజుల ఏటీఎం కార్డు ట్రాన్సాక్షన్లను బ్యాంకుకు తెలియజేయాలి. అనంతరం వీటిని బ్యాంకులు పరిశీలించి బీమాను బాధిత కుటుంబానికి అందజేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)