* 10 సంవత్సరాలు ఫీల్డ్‌లో పని చేయాలి : ఇండియన్ రైల్వేస్‌లోని యువ అధికారులు ఇప్పుడు ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్‌కి అర్హత సాధించడానికి మొదటి 10 సంవత్సరాలు ఫీల్డ్‌లో గడపాల్సి ఉంటుంది. ప్రధాన విధానపరమైన మార్పుల్లో భాగంగా రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో కొత్త అధికారులను కూడా నియమించవచ్చు. ప్రధాన కార్యాలయంలో కంఫర్టబుల్ పోస్టులకు వెళ్లే ముందు అధికారులకు క్షేత్రస్థాయిలో తగినంత అనుభవం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో..‘డైరెక్ట్ రిక్రూట్ గ్రూప్ 'ఎ' రైల్వే ఆఫీసర్లకు ఫీల్డ్ వర్కింగ్ ఎక్స్‌ఫీరియన్స్ అవసరం. వారి సర్వీస్‌లో మొదటి 10 సంవత్సరాలలో సాధారణంగా ఫీల్డ్‌లో పోస్ట్ చేయాలని నిర్ణయించాం. డైరెక్ట్ రిక్రూట్ గ్రూప్ ఎ అధికారులకు నేరుగా ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ ఉండదు.’ అని పేర్కొంది.
* సవాళ్లను ఎదుర్కోవాలి : ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పిన తర్వాత జరిగిన సమావేశంలో రైల్వే బోర్డ్ ఛైర్మన్ ఎకె లహోటి మాట్లాడుతూ.. భారతదేశం అంతటా ఉన్న జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లు స్వయంగా ప్రమాద స్థలానికి వెళ్లి పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ఫీల్డ్ పోస్టింగ్‌లు చాలా శ్రమ, డిమాండ్‌తో కూడుకున్నవని, రైల్వేలకు మరింత ఉత్పాదకతను అందిస్తాయని అన్నారు. ఇది భవిష్యత్తులో యువ అధికారులు ఎదుర్కొనే సవాళ్లకు సిద్ధం చేస్తుందని, త్వరగా నిర్ణయం తీసుకొనే సామర్థ్యాలను లభివృద్ది చేస్తుందని తెలిపారు. అందుకు యువ అధికారులకు మొదట ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మరో అధికారి మాట్లాడుతూ.. నేషనల్ ట్రాన్స్పోర్టర్లో నిర్ణయాధికారులు ఎక్కువగా క్షేత్రస్థాయిలో రియాలిటీస్కూ దూరంగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు. ఫీల్డ్‌లో ప్రారంభ పోస్టింగ్‌లు అధికారులను గ్రౌండ్ రియాలిటీలతో సన్నద్ధం చేస్తాయని చెప్పారు. ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని గ్రామీణ ప్రాంతాల్లో ఎలా జీవించాలో వారు నేర్చుకుంటారని పేర్కొన్నారు.