Aadhar Card Photo Update: ఆధార్ కార్డులోని ఫొటో మార్చుకోవాలా.. అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Aadhar Card Photo Update: ఆధార్ కార్డులోని ఫొటో మార్చుకోవాలా.. అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
మీరు బ్యాంక్ ఖాతాను తెరవాలనుకుంటే లేదా కొత్త సిమ్ కార్డ్‌ని పొందాలనుకుంటే ఆధార్ కార్డు అనేది అవసరం. ఇలా ప్రతీచోటా ఈ ఆధార్ కార్డు అనేది గుర్తింపు అండ్ అడ్రస్ కు ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది.
మీరు బ్యాంక్ ఖాతాను తెరవాలనుకుంటే లేదా కొత్త సిమ్ కార్డ్‌ని పొందాలనుకుంటే ఆధార్ కార్డు అనేది అవసరం. ఇలా ప్రతీచోటా ఈ ఆధార్ కార్డు అనేది గుర్తింపు అండ్ అడ్రస్ కు ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ప్రతి భారతీయుడు ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. మీరు ఇంటి నుండి ఆధార్ కార్డులో పేరు, చిరునామాను సులభంగా మార్చుకోవచ్చు. చాలామంది ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను ఇష్టపడరు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
మీకు కూడా మీ ఆధార్ ఫోటో నచ్చకపోతే ఏ మాత్రం చిందించాల్సిన అవసరం లేదు. మీరు ID ఫోటోను సులభంగా మార్చవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఫోటోను మార్చడానికి మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్డేట్ చేసే ప్రక్రియ చాలా సులభం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో మీరు ఆధార్‌లో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ మొదలైనవాటిని సులభంగా మార్చుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అయితే దీని కోసం మీ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. కాబట్టి ఈ గుర్తింపు కార్డులో ఫొటో మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. ఆధార్ కార్డ్‌లోని ఫోటోను అప్డేట్ చేయడానికి UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు ఆధార్ విభాగానికి వెళ్లి ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
తర్వాత ఈ ఫారమ్‌ను పూరించి.. సమీపంలోని ఆధార్ సెంటర్లో సమర్పించండి. ఈ ప్రక్రియ కోసం మీరు రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ ప్రక్రియ తర్వాత మీకు రసీదు కూడా ఇవ్వబడుతుంది. మీరు రసీదుపై ఉన్న URN నంబర్ని ఉపయోగించడం ద్వారా ఆధార్ అప్డేట్ చేయబడిందో లేదో తనిఖీ చేయవచ్చు. దీని తర్వాత.. నవీకరించబడిన ఆధార్ కార్డ్ కొద్ది రోజుల్లో మీ ఇంటికి వస్తుంది.