చెక్ క్లియరింగ్ లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) 24 గంటలూ పనిచేస్తుందని కూడా ఆర్బీఐ ప్రకటించింది. అంటే ఇకపై ఆదివారం కూడా ఎంటిటీ ప్రాసెస్ తో సహా చెక్ క్లియరింగ్ జరిగిపోతుందని చెప్పవచ్చు. ఈ చెక్ రూల్స్ నేషనల్, ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం )
ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) ద్వారా నిర్వహించే అతి పెద్ద చెల్లింపుల సంస్థ. ఇది జీతాలు, పెన్షన్లు, వడ్డీ, డివిడెండ్లు మొదలైన అనేక రకాల లావాదేవీలను నిర్వహిస్తుంది. ఎన్ఏసీహెచ్ కూడా చాలా ఆర్థిక సేవలను అందిస్తుంది. దీని ద్వారా విద్యుత్, గ్యాస్, వంటి వివిధ బిల్లులను చెల్లించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం )
ఎన్ఏసీహెచ్ తో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని కేంద్రం భావిస్తోంది. RTGS, NACH సేవలను 24/7 అందుబాటులోకి తెచ్చి బ్యాంకు ఖాతాదారుల పనులను సులభతరం చేయడానికే అపెక్స్ బ్యాంక్ ఈ సరికొత్త మార్పులను తీసుకు వచ్చింది. ఈ కొత్త రూల్స్ దృష్టిలో పెట్టుకొని మీరు మీ చెక్కులను జారీ చేసుకుంటే జరిమానాలు నుంచి బయటపడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం )