అయితే వార్షిక AIS సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ, డివిడెండ్, మూలధన లాభాలు, షేర్ లావాదేవీల అన్ని వివరాలను కలిగి ఉంటుంది. ఫారమ్ 26AS (NSDL), ప్రీ-ఫీల్డ్ ఇన్కమ్ టాక్స్ ఫారమ్‌ల మధ్య డేటా సరిపోలడం కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం తక్కువ మొత్తాన్ని వాపసు పొందే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల ప్రారంభించబడిన AIS ఒక సమగ్ర పత్రం, సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ, డివిడెండ్ వంటి సమాచారాన్ని కలిగి ఉందని చార్టర్డ్ క్లబ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. ఇప్పటికే ఉన్న ఫారమ్ 26AS కేవలం FD వడ్డీని మాత్రమే కలిగి ఉందని.. డివిడెండ్ వివరాలను కలిగి ఉండదని తెలిపారు. అందువల్ల ఇంతకుముందు AIS సమాచారం లేని, ఫారం 26AS ఆధారంగా మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేసిన వారికి నోటీసులు అందుతున్నాయని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)