బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కర్డు ద్వారా గడిచిన 45 రోజుల్లో ఒక్కసారి అయినా ఏటీఎం కార్డును ఉపయోగిస్తే ఇన్సూరెన్స్ సర్వీసులు పొందటానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఈ 45 రోజుల గడువు అనేది బ్యాంక్ ప్రాతిపదికన మారుతుంది. కొన్ని బ్యాంకులు 60 రోజులు దాకా గడువు ఇవ్వొచ్చు. ఏదేమైనా కస్టమర్లు డెబిట్ కార్డును ఉపయోగిస్తూ ఉండటం ముఖ్యం.
ఎస్బీఐ గోల్డ్ కార్డు (మాస్టర్ కార్డ్, వీసా కార్డు) కలిగిన వారికి రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎస్బీఐ ప్లాటినం కార్డు (మాస్టర్, వీసా కార్డులు)) కలిగిన వారికి అయితే రూ. 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. అలాగే ఎస్బీఐ ప్రైడ్ బిజినెస్ కార్డు అయితే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది.
డెబిట్ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామినీ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయొచ్చు. బ్యాంక్ అప్లికేషన్, డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, డిపెండెంట్స్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అదే ఎస్బీఐ డెబిట్ కార్డు వాడే వారు ఎయిర్ యాక్సిడెంట్లో మరణిస్తే.. వారి కుటుంబాలకు ఇంకా అధిక ఇన్సూరెన్స్ లభిస్తుంది.