Govt Scheme Investment: ఈ ప్రభుత్వ పథకంలో రూ.200 పొదుపు చేస్తే.. రూ. 32 లక్షలు రిటర్న్ పొందొచ్చు..
Govt Scheme Investment: ఈ ప్రభుత్వ పథకంలో రూ.200 పొదుపు చేస్తే.. రూ. 32 లక్షలు రిటర్న్ పొందొచ్చు..
Govt Scheme Investment: పొదుపు చేయడం అనేది ఎప్పటికైనా మేలు చేస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని.. రోజుకు రూ.200 పొదుపు చేస్తే.. 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. ఆ పథకం ఏంటి.. ? ఆ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పొదుపు చేయడం అనేది ఎప్పటికైనా మేలు చేస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని.. రోజుకు రూ.200 పొదుపు చేస్తే.. 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. ఆ పథకం ఏంటి.. ? ఆ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఎవరైనా డబ్బులను సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే.. వాటిని పొదుపుగా వాడుకోవడం మరో ఎత్తు. సంపాదించిన డబ్బు అంతా వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేస్తే.. భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే.. నెలకు వచ్చే సంపాదనలో ఎంతోకొంత పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబానికి ఆర్థిక భరోసా ఏర్పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అయితే ఇలా పొదుపు చేసుకునేందుకు బ్యాంక్ లు, పోస్టాఫీసులు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. అందులో వడ్డీ ఎక్కువ వచ్చేవి కూడా ఉన్నాయి. బ్యాంక్ లో కంటే.. పోస్టాఫీసుల్లో పొదుపు చేసిన డబ్బులకు ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అయితే రెండింటిలోనూ ఒకటే వడ్డీ రేటును ఇచ్చే ఓ పథకం ఉంది.. అదే ప్రభుత్వ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్). పథకంలో పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో మీకు 32 లక్షల రూపాయల ఫండ్ క్రియేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
అయితే దీనికి రోజుకు రూ.200 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా నెలకు రూ.6వేలు మీ జీతంలో పక్కకు పెడితే.. 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పొదుపు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతను తెరవడానికి కేవలం రూ.500 ఉంటే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇందులో ఏటా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లు ఉంటుంది. అయితే.. మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల వరకు దీనిని పొడిగించుకునే వీలు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)