State Bank Of India | దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. భారీ గుడ్ న్యూస్ తెచ్చింది. కస్టమర్ల కోసం కళ్లుచెదిరే తగ్గింపు అందుబాటులో ఉంచింది.
2/ 9
ఎస్బీఐ కస్టమర్లకు ఏకంగా రూ. 40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోంది. ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.
3/ 9
స్టేట్ బ్యాంక్ కస్టమర్లు యోనో ఎస్బీఐ ద్వారా మేక్ మై ట్రిప్‌లో హాలిడే ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ భారీ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఏకంగా రూ. 40 వేల వరకు తగ్గింపు పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది.
4/ 9
అయితే ఎస్బీఐ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. కూపన్ కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎస్బీఐఎంఎంటీ అనే ప్రోమో కోడ్ వాడాలి. పేమెంట్ చేసే సమయంలో ఈ కూపన్ కోడ్ ఉపయోగిస్తే.. తగ్గింపు వస్తుంది.
5/ 9
స్టేట్ బ్యాంక్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలని భావించే వారు ఎస్బీఐ యోనో యాప్‌లోకి వెళ్లి డీల్ సొంతం చేసుకోవచ్చు. ముందుగా ఎస్బీఐ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్‌లోకి వెళ్లాలి. తర్వాత హాలిడే ఆప్షన్ ఎంచుకోవాలి.
6/ 9
తర్వాత మైక్ మై ట్రిప్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన హాలిడే ప్యాకేజ్ ఎంచుకోవాలి. తర్వాత ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా బుక్ చేసుకోవాలి. కూపన్ కోడ్ ఉపయోగించడం వల్ల మీకు తగ్గింపు వస్తుంది.
7/ 9
అందువల్ల హాలిడే ట్రిప్ ప్లాన్ చేసే వారు ఎస్బీఐ అందిస్తున్న ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు పొందొచ్చు. అయితే ఇక్కడ మీరు ఎంచుకు టూర్ ప్యాకేజీ ప్రాతిపదికన మీకు వచ్చే డిస్కౌంట్ కూడా మారుతూ ఉంటుంది.
8/ 9
కాగా మీరు ఇప్పటికే ఎస్బీఐ యోనో యాప్ వాడుతూ ఉంటే.. ఇబ్బంది లేదు. నేరుగా యాప్‌లోకి వెళ్లి టూర్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు యోనో యాప్ వాడకపోతే.. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
9/ 9
తర్వాత యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కచ్చితంగా ఫోన్లో ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. ఇంకా నెట్ బ్యాంకింగ్ వివరాలతో లాగిన్ అవ్వొచ్చు. తర్వాత ఆఫర్ పొందొచ్చు.