Two Wheeler Offer: ఒక్క రూపాయి కట్టకుండా జీరో డౌన్ పేమెంట్‌తో బైక్ కొనేయండి.. 5.99 శాతం వడ్డీకే లోన్!
Two Wheeler Offer: ఒక్క రూపాయి కట్టకుండా జీరో డౌన్ పేమెంట్‌తో బైక్ కొనేయండి.. 5.99 శాతం వడ్డీకే లోన్!
Loan EMI | కొత్త బైక్ కొనే వారికి తీపికబురు. తక్కువ వడ్డీకే లోన్ ఆఫర్ ఉంది. ఇంకా జీరో డౌన్ పేమెంట్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే తక్కువ ఈఎంఐ పెట్టుకోవచ్చు.
Interest Rates | కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్ సహా తక్కువ వడ్డీకే లోన్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. ఏ కంపెనీ బైక్స్‌పై ఎలాంటి డీల్స్ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2/ 9
యెజ్డి బైక్స్‌పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తన మోడళ్లపై ఈ బెనిఫిట్స్ అందిస్తోంది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. జీరో డౌన్ పేమెంట్‌తో మీరు యెజ్డి బైక్స్‌ను కొనుగోలు చేయొచ్చు.
3/ 9
అంతేకాకుండా లోన్ తీసుకొని బైక్ కొనుగోలు చేయాలని భావించే వారికి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కేవలం 5.99 శాతం నుంచే వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. అలాగే ఈఎంఐ కూడా తక్కువగానే పెట్టుకోవచ్చు.
4/ 9
యెజ్డి బైక్స్‌పై నెలవారీ ఈఎంఐ రూ. 4873 నుంచి ప్రారంభం అవుతోంది. లోన్ ఈఎంఐ అనేది పలు రకాల అంశాల ప్రాతిపదికన మారుతుంది. లోన్ అమౌంట్, వడ్డీ రేటు, టెన్యూర్ ఇలా చాలా అంశాలు మీ లోన్ ఈఎంఐ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.
5/ 9
అలాగే లోన్ తీసుకునే వారికి ఎక్కువ టెన్యూర్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా 4 ఏళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. దీని వల్ల తక్కువ ఈఎంఐ పడుతుంది. అయితే వడ్డీ భారం పెరుగుతుందని గుర్తించుకోవాలి.
6/ 9
ఐడీఎఫ్సీ బ్యాంక్ ద్వారా కంపెనీ తన యెజ్డి టూవీలర్లపై ఇలాంటి బెనిఫిట్స్‌ను అందుబాటులో ఉంచింది. మీరు కూడా ఫైనాన్స్ సదుపాయం పొందాలని భావిస్తే.. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలను అందిస్తే సరిపోతుంది. అలాగే ఈఎంఐ క్యాలిక్యూటర్ ద్వారా ఎంత ఈఎంఐ పడుతుందో చెక్ చేసుకోవచ్చు.
7/ 9
కాగా కంపెనీ కస్టమర్లకు వివిధ రకాల బైక్స్‌ను అందుబాటులో ఉంచింది. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ వంటి మోడళ్లను కస్టమర్లకు అందిస్తోంది. ఈ బైక్స్‌ను మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. రూ. 5 వేలకు బుక్ చేసుకోవచ్చు.
8/ 9
రోడ్‌స్టర్ బైక్ ధర రూ. 2 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. స్క్రాంబ్లర్ రేటు కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. అయితే అడ్వెంచర్ బైక్ రేటు మాత్రం రూ. 2.12 లక్షలుగా ఉంది. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధరలు. ఆన్‌రోడ్ ధర ఇంకా ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోవాలి.
9/ 9
ఇకపోతే మీరు బైక్ కొనే ముందు కొన్న విషయాలు గుర్తించుకోవాలి. లోన్ తీసుకొని ఫైనాన్స్‌లో బైక్ కొనే ముందు వడ్డీ రేట్లు, లోన్ ఈఎంఐ, లోన్ టెన్యూర్ వంటి అంశాలు అన్నింటికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.