యస్ బ్యాంక్ ఎఫ్డీ రేట్ల పెంపుతో పాటుగా మరో తీపికబురు అందించింది. బ్యాంక్ జనవరి 3 నుంచి 15 నెలల టెన్యూర్‌తో స్పెషల్ ఎఫ్డీ పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్‌పై రెగ్యులర్ కస్టమర్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. కస్టమర్లు రూ.10 వేల కనీస ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎఫ్డీ అకౌంట్ తెరవొచ్చు.
నెక్ట్స్ జనరేషన్ మొబైల్ అప్లికేషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యస్ బ్యాంక్ ప్రకటించింది. ఖాతాదారులకు మెరుగైన పర్సనలైజ్డ్ బ్యాంకింగ్ సర్వీసులు అందించడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. దీని వల్ల యస్ బ్యాంక్ కస్టమర్లు మెరుగైన సర్వీసులు సొంతం చేసుకోవచ్చు. దీంతో బ్యాంక్ ఒకే రోజు మూడు శుభవార్తలు అందించిందని చెప్పుకోవచ్చు.