దేశంలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ నిలిచిందని ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను జనవరి 3న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం హెచ్డీఎఫ్సీ ఎమ్ఎఫ్ రూ.3.35 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో మొదటిస్థానంలో ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
మే: ట్రేడ్ వార్..చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకాలు పెంపు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచారు. మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు చేశారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా పన్ను రేటును 10 నుంచి 25 శాతానికి పెంచింది.
డిసెంబర్: జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 5 శాతం మేరే ఉండొచ్చని ఎంపీసీ పేర్కొంది. 6.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను సవరించింది. 2019-20 రెండో అర్ధభాగంలో (2019 అక్టోబర్- 2020 మార్చి) వృద్ధి రేటు 4.9-5.5 శాతం మధ్య.. 2020-21 మొదటి ఆరు నెలల కాలంలో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది.