1. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ (Rolls Royce) ఇప్పుడు ఎలక్ట్రిక్ లైనప్‌పై దృష్టి పెట్టింది. ఈ కంపెనీ 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ మొబిలిటీ లైనప్‌కు మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ రూపొందించిన మొట్టమొదటి ఫుల్లీ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్’ను తాజాగా ఆవిష్కరించింది. (Photo: Rolls-Royce)
2. ఈ అల్ట్రా లగ్జరీ ఈవీ కారును హై రేంజ్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో తయారు చేసింది. డిజైన్, లుక్, కెపాసిటీ.. ఇలా ప్రతి విభాగంలోనూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండేలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూపొందించింది. 2023 చివరి నాటికి స్పెక్టర్ వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోంది. దీని ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుందాం. (Photo: Rolls-Royce)
3. రోల్స్ రాయిస్ నుంచి గ్లోబల్ మార్కెట్లోకి రానున్న మొట్టమొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ మోటారు కారు ‘స్పెక్టర్’పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే కంపెనీ మంగళవారం దీన్ని అధికారికంగా ఆవిష్కరించిన తర్వాత, కస్టమర్లు దీనిపై పెట్టుకున్న అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. (Photo: Rolls-Royce)
5. స్పెక్టర్ పరిచయంతో రోల్స్ రాయిస్ ఇప్పుడు అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే క్లాస్ ఆటోమొబైల్స్ కోసం సరికొత్త ప్రమాణాన్ని రూపొందించింది. ఈ కారు చరిత్రాత్మక రోల్స్ రాయిస్ డిజైన్‌ను ప్రతిబింబిస్తోంది. ఈ తరం కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లలో అందిస్తున్న అన్నిరకాల ఫీచర్లను మించి, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్లతో దీని డిజైన్ చేశారు. ఇన్స్టంట్ టార్క్, సైలెంట్ ఆపరేషన్ వంటివి బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. (Photo: Rolls-Royce)
6. స్పెక్టర్ రేంజ్ 320 మైళ్ల (520 కి.మీ) WLTP వరకు ఉంటుంది. దీంట్లోని 430 kW మోటార్.. 900 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది కేవలం 4.4 సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (100 కిలోమీటర్లు) వేగాన్ని అందుకోగలదు. లైటెడ్ సర్పేస్, రీబిల్ట్ స్పిరిట్ డిజిటల్ లగ్జరీ ఆర్కిటెక్చర్‌తో ఇది క్లాసిక్ రోల్స్ రాయిస్ లెగసీని కొనసాగిస్తోంది. (Photo: Rolls-Royce)
7. రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను వివిధ రకాల కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో టెస్ట్ చేశారు. ఇది అన్ని రకాల పరిస్థితులను తట్టుకునే అత్యంత ఏరోడైనమిక్ వాహనంగా కంపెనీ అభివర్ణించింది. అద్భుతమైన ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌తో పాటు 4,796 సాఫ్ట్ లైట్లను కలిగి ఉన్న 'స్టార్‌లైట్ డోర్స్' ఈ కారుకు స్పెషల్ అట్రాక్షన్. ఈ లైట్లు వివిధ రకాల థీమ్స్‌తో వస్తాయి. ఈ రెండు డోర్ల కూపే వెహికల్, 23 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. తాజా కారు ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. (Photo: Rolls-Royce)