Volkswagen Tiguan : వోక్స్వ్యాగన్ ఇండియా.. తన ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ టిగ్వాన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ఎక్స్ షోరూమ్ ధరను రూ.33.49 లక్షలుగా తెలిపింది. స్టాండర్డ్ టిగ్వాన్ SUVకి చిన్న చిన్న కాస్మెటిక్ అప్డేట్స్తో ఈ కొత్త కారును తెచ్చింది. 2 కలర్ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. అవి ప్యూర్ వైట్, ఓరిక్స్ వైట్. ఈ కొత్త ఎడిషన్‌కి వెనకవైపున రియర్ లోడ్ సిల్ ప్రొటెక్షన్, స్పోర్టీ 18 అంగుళాల అలాయ్ వీల్స్, అల్యూమినియం పెడల్స్, డైనమిక్ హబ్కాప్స్ ఉన్నాయి.