1. రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత బెర్త్ కన్ఫామ్ అయితే జర్నీ ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ బెర్త్ కన్ఫామ్ కాకపోతే పదేపదే పీఎన్ఆర్ స్టేటస్ చెక్ (PNR Status Check) చేయడం ప్రయాణికులకు అలవాటే. అయితే కొందరు తమ ట్రైన్ టికెట్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చిక్కులు తెచ్చిపెడుతోంది. రైలు టికెట్ వివరాలను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు టికెట్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచిది కాదు. రైలు టికెట్ వివరాలు మాత్రమే కాదు, ఇతర వ్యక్తిగత వివరాలు, సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని బ్యాంకులు, అనేక సంస్థలు హెచ్చరిస్తుంటాయి. ఒక్క చిన్న నిర్లక్ష్యం అయినా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని తాజాగా ఓ ఘటన తెలియజేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆర్ఏసీ టికెట్ కన్ఫామ్ అయిందంటే బెర్త్ లభించలేదనే అర్థం. సీట్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తనకు బెర్త్ కన్ఫామ్ కావాలనుకున్న మహిళ ఆ వివరాలను ట్విట్టర్లో షేర్ చేసి వివరాలు తెలుసుకుందాం అనుకుంది. తన టికెట్ వివరాలు, మొబైల్ నెంబర్ ట్విట్టర్లో షేర్ చేసి ఐఆర్సీటీసీ సాయం కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఎంటర్ అయ్యారు. ట్విట్టర్ పోస్ట్‌లో మొబైల్ నెంబర్ కూడా ఉండటంతో సైబర్ నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేశారు. ఆమె కొడుకు కాల్ లిఫ్ట్ చేశారు. అవతలివైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడాడు. తాను ఐఆర్సీటీసీ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటీవ్ అని నమ్మించాడు. ఆర్ఏసీ టికెట్‌ను కన్ఫామ్ చేసేందుకు సాయం చేస్తానని చెప్పాడు. (ప్రతీకాత్మక చిత్రం)
6. సదరు కాలర్ ఓ లింక్ పంపించి వివరాలన్నీ ఎంటర్ చేసి, కేవలం రూ.2 చెల్లిస్తే ట్రైన్ టికెట్ కన్ఫామ్ అవుతుందని చెప్పాడు. తమకు నిజంగానే ఐఆర్సీటీసీ సిబ్బంది ఫోన్ చేశారని అనుకుని సదరు మహిళ, ఆమె కొడుకు వివరాలన్నీ ఎంటర్ చేసి, రూ.2 చెల్లించారు. అంతే కొన్ని నిమిషాల్లోనే వారి అకౌంట్ నుంచి రూ.64,000 డెబిట్ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)