లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) గత కొన్ని నెలల నుంచి అనేక రాకాల కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. సురక్షితమైన రాబడిని అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులకు ఈ ఎల్ ఐసీ అనేక కొత్త పాలసీలను తీసుకొస్తోంది. అందులో జీవన్ ప్రగతి పాలసీ కూడా ఒకటి. పెట్టుబడిదారులు తమ రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం కొరకు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉతమమైన పాలసీ. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రతీ నెల పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు మరణ బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పెట్టుబడిదారులు తమ రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం కొరకు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉతమమైన పాలసీ. దీనిని Insurence Regulatory development authority Of India (IRDAI)ఆమోదించింది. (ప్రతీకాత్మక చిత్రం)
సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది తీసుకున్నవారు... రోజుకు రూ.200 పెట్టుబడి పెట్టాలి. అలా రూ.20 ఏళ్లు పెడితే... మొత్తం పెట్టిన పెట్టుబడి సుమారు రూ.15 లక్షల దాకా అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
దానికి రిటర్న్ రూ.28 లక్షలు వస్తుంది. అంతేకాదు... రూ.15,000 పెన్షన్ కూడా ఇస్తారు. అంటే... మొత్తం వచ్చేది రూ.29 లక్షలకు పైనే. ఒకవేల పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లయితే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)