WIPRO ALSO RAISED WAGES FOR ITS EMPLOYEES DURING THE CORONA CRISIS VB
Salaries Increased: తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిన ఆ సంస్థ.. హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..
Salaries Increased: కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఆ సంస్థ తమ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి ఇబ్బందులు పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇలాంటి సమయంలో తమ ఉద్యోగులకు దేశీయ ఐటీ సేవల దిగ్గజ కంపెనీ విప్రో శుభవార్త చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
పనితీరు ఆధారంగా, స్థాయిని బట్టి వేతనాలు పెంచతున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఒకే క్యాలెండర్ ఇయర్ లో వేతనాలు పెంచడం రెండోసారి కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
మేనేజర్లు అంతకంటే పై స్థాయి వారికి ఈనెల అంటే జూన్ 1వ తేదీ నుంచే పెంపు అమలులోకి వస్తుందని.. జూనియర్లకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి పెంపు చేసినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
మరో దేశీయ ప్రధాన కంపెనీ టీసీఎస్ ఇప్పటికే తన ఉద్యోగులకు తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు వేతనాలు పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇప్పుడు విప్రో కూడా వేతనాల పెంపును ప్రకటించింది. కష్టకాలంలో వేతనాల పెంపు నిర్ణయాన్ని ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా స్వాగతిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)