డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ అస్థిరతను కట్టడి చేయడానికి కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుండి 15 శాతానికి పెంచింది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 5
బంగారం దిగుమతులను అరికట్టేందుకు, కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10.75% నుండి 15%కి పెంచినట్టు పేర్కొంది. సవరించిన దిగుమతి నేటి నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. భారతదేశం బంగారానికి రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉంది.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 5
దేశంలోని బంగారం డిమాండ్ ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే వస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు మధ్య దిగుమతులను తగ్గించే చర్యగా దిగుమతి సుంకంలో సవరణ చేశారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 5
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం... దేశ దిగుమతుల్లో గణనీయమైన పెరుగుదల కారణంగా భారతదేశ వాణిజ్య లోటు 2022 మేలో రికార్డు స్థాయిలో $6.53 బిలియన్ల నుండి గత ఏడాది ఇదే నెలలో $24.29 బిలియన్లకు పెరిగింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 5
దిగుమతి సుంకం పెంపు ప్రకటన తర్వాత, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం ధరలు 2 శాతంపైగా పెరిగి 10 గ్రాములకు రూ.51,600కి చేరుకున్నాయి.(ఫ్రతీకాత్మక చిత్రం)