Gold Loan Rates: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ బ్యాంకుల్లో చౌక వడ్డీకే బంగారు రుణాలు!
Gold Loan Rates: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ బ్యాంకుల్లో చౌక వడ్డీకే బంగారు రుణాలు!
Gold Loan Interest Rates | మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటులో బంగారు రుణాలు అందిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate | ఇంట్లో బంగారం ఉందా? దీన్న తనఖా పెట్టి గోల్డ్ లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఒక బ్యాంక్ తక్కువ వడ్డీ రేటుకే కస్టమర్లకు గోల్డ్ లోన్స్ అందిస్తోంది. ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ లభిస్తున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
2/ 8
యూనియన్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారు రుణాలపై వడ్డీ రేటు 8.45 శాతంగా ఉంది. ఇక ఎస్బీఐలో చూస్తే.. గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది.
3/ 8
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 8.6 శాతంగా ఉంది. ఫెడరల్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్‌పై వడ్డీ రేటు 8.64 శాతంగా కొనసాగుతోంది. యూకో బ్యాంక్‌లో బంగారు రుణాలపై 8.65 శఆతం వడ్డీ రేటు పడుతుంది. బ్యంక్ ఆఫ్ బరోడాలో చూస్తే.. గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంది.
4/ 8
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9 శాతంగా ఉంది. ఇండియన్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటే 9 శాతం వడ్డీ కట్టాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తే.. వడ్డీ రేటు 9.45 శాతంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.65 శాతంగా కొనసాగుతోంది.
5/ 8
కెనరా బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.7 శాతంగా ఉంది. ధన లక్ష్మీ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.8 శాతంగా ఉంది. కర్నాటక బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.86 శాతంగా కొనసాగుతోంది. జే అండ్ కే బ్యాంక్‌లో బంగారు రుణాలపై వడ్డీ రేటు 10.15 శాతంగా ఉంది.
6/ 8
ఐసీఐసీఐ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 11 శాతంగా ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 14.55 శాతంగా కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్‌లో 17 శాతం వడ్డీ రేటు పడుతుంది.
7/ 8
ఇంకా బజాజ్ ఫిన్‌సర్వ్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. మణపురం ఫైనాన్స్‌లో 9.9 శాతం నుంచి గోల్డ్ లోన్ వడ్డీ రేటు ప్రారంభం అవుతోంది. ముత్తూట్ ఫైనాన్స్‌లో చూస్తే.. గోల్డ్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుంచి ఉంటుంది. గోల్డ్ లోన్‌ను 3 నెలల నుంచి 48 నెలల లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
8/ 8
ఇకపోతే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 57,160 వద్ద ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 52,400 వద్ద కొనసాగుతోంది.