సంపాదించే వ్యక్తి చనిపోతే.. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్. ఊహించని సందర్భాల్లో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి పాలసీ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. మార్కెట్లో ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్ పాలసీలు(Insurance Policy), పెట్టుబడులు(Investments) పెట్టే పథకాలు అందుబాటులో ఉన్నాయి. భద్రతను కల్పించే ఇన్సూరెన్స్ పాలసీలు, ఎలాంటి రిస్కు లేకుండా నగదు అందించే బాండ్లు, ఫిక్స్డ్ డిజాపిట్ స్కీములు, దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇచ్చే ఈక్విటీ, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ ప్లానులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏ విధంగా భద్రత కల్పించినా ఆ మొత్తం పాలసీ హోల్డర్ లేదా ఇన్వెస్టర్(Investor) ఎంపిక చేసుకొన్న నామినీకి లేదా చట్టబద్ధమైన వారసులకు ప్రయోజనాలు అందుతాయి. ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ అవసరాలకు ఆ నగదు చాలా అవసరం. ఆయా ప్లాన్ల నుంచి డబ్బును కుటుంబంలోని నామినీకి, వారసులకు బెనిఫిట్స్ అందించడాన్ని ట్రాన్స్మిషన్(Transmission) అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSC)
పోస్టాఫీసులు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అందిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇన్వెస్టర్ చనిపోయిన తేదీ వరకు స్పెషల్ ఇంట్రెస్ట్ అందిస్తారు. ఆ తర్వాత ఇన్వెస్టర్ ఎంచుకొన్న నామినీ లేదా వారసులకు ట్రాన్స్మిషన్ పూర్తయ్యే వరకు సేవింగ్స్ ఇంట్రస్ట్ చెల్లిస్తారు. ఒకవేళ ఇన్వెస్టర్ చనిపోయిన తర్వాత సేవింగ్స్ ఇంట్రస్ట్ కంటే ఎక్కువ చెల్లించినట్లు ఉంటే ఆ మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి తీసుకొని మిగిలిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
లైఫ్ ఇన్సూరెన్స్
ఇన్కమ్, ఇంట్రస్ట్ పేమెంట్ ఆప్షన్స్, చెల్లింపులు వంటివి అందించే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ పాలసీ హోల్డర్ చనిపోయాక ఆగిపోతాయి. పాలసీ హోల్డర్ మరణించిన తేదీ సమాచారం తెలపడం, ఇతర జాప్యాలు చోటుచేసుకొని ఉండి కంపెనీ నుంచి ఏదైనా మొత్తం అందించి ఉంటే ఆ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి తీసుకుంటారు. అందుకే నామినీలు, వారసులు ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను గుర్తుంచుకోవాలి. ముందుగా వీటిని క్లెయిమ్ చేసుకొనే ప్రయత్నం చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
నేషనల్ సేవింగ్ర్ సర్టిఫికేట్ పీరియడ్ పూర్తికాక ముందే ఇన్వెస్టర్ మరణిస్తే.. అప్పటి వరకు అందిస్తున్న స్పెషల్ ఇంట్రస్ట్ చెల్లించరు. కేవలం సేవింగ్స్ ఇంట్రస్ట్ మాత్రమే చెల్లిస్తారు. ఈ సందర్భాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు నామినీ వేచి ఉండొచ్చు. మెచ్యూరిటీ తేదీనే అందే మొత్తాన్ని తీసుకోవడం మేలు. మధ్యలోనే ఇన్వెస్టర్ మరణించినా ఈ పీరియడ్ పూర్తయ్యే వరకు నామినీ వేచి ఉంటే ప్రత్యేక ఇంట్రస్ట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)
నామినీ క్లెయిమ్ చేసుకోవడానికి అప్లై చేసే వరకు ముందు అందిస్తున్న వడ్డీ రేటును కొనసాగిస్తారు. ఒక వేళ నెల మధ్యలో 15వ తేదీన క్లెయిమ్ కోసం ప్రయత్నిస్తే ఆ ముందు నెల వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. క్లెయిమ్ చేసుకొనే రోజు వరకు స్పెషల్ ఇంట్రస్ట్ చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈక్విటీస్, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్
ఇందులో ఎలాంటి ఇంట్రస్ట్, బోనస్‌లు అందవు. కేవలం ఇన్వెస్టర్‌కు లభించిన ష్టేర్లను బదిలీ చేస్తారు. ఒక్కసారి షేర్లు నామినీకి బదిలీ అయిన తర్వాత వారి సౌలభ్యం మేరకు షేర్లను విక్రయించుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ప్రైస్‌ను బట్టి లాభాలు, నష్టాలు ఆధారపడి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ట్యాక్సేషన్
షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఈక్విటీ లేదా ఈక్విటీ షేర్లపై తీసుకొనే రిడమ్షన్ను షేర్లు తీసుకొన్న తేదీని బట్టి నిర్ణయిస్తారు. ఇందులో నామినీ షేర్లను బదిలీ చేసుకొన్న రోజుతో సంబంధం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్ అందించే పథకాలకు సాధారణంగా ఉన్న పన్నులు అప్లై అవుతాయి. నామినీకి క్లెయిమ్ మొత్తం అందాక పన్ను విధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)