4. వాట్సప్ పేమెంట్స్ యాక్సెస్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది?
వాట్సప్ పేమెంట్స్ మీకు వచ్చిందో లేదో తెలియాలంటే ముందుగా యాప్ అప్డేట్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్లో వాట్సప్ యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి. అందులో Payments ఆప్షన్ ఉంటే మీకు వాట్సప్ పేమెంట్స్ యాక్సెస్ లభించినట్టే. (ప్రతీకాత్మక చిత్రం)
5. వాట్సప్ పేమెంట్స్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
వాట్సప్ యాప్‌లో Payments ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత Add payment method పైన క్లిక్ చేయాలి. వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ఉపయోగించాలంటే టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాల్సి ఉంటుంది. నియమనిబంధనలు చదివిన తర్వాత Accept and Continue పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే బ్యాంకుల లిస్ట్ నుంచి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకును సెలెక్ట్ చేయాలి. అకౌంట్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. అకౌంట్ సెలెక్ట్ చేస్తే అకౌంట్ సెటప్ పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వాట్సప్ పేమెంట్స్‌లో డబ్బులు ఎలా పంపాలి?
వాట్సప్ పేమెంట్స్ ద్వారా రెండు పద్ధతుల్లో డబ్బులు పంపొచ్చు. మీరు డబ్బులు పంపాలనుకునే వారి ఛాట్ విండో ఓపెన్ చేసిన తర్వాత అటాచ్మెంట్ పైన క్లిక్ చేయాలి. అందులో Payment ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సెండ్ మనీ పైన క్లిక్ చేసి అమౌంట్ టైప్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సప్ పేమెంట్స్‌లో డబ్బులు పంపడానికి రెండో పద్ధతి ఏంటీ?
రెండో పద్ధతి ద్వారా డబ్బులు పంపాలనుకుంటే వాట్సప్ ఓపెన్ చేసి రైట్ టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అందులో Payments ఆప్షన్లో న్యూ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో పేరు సెలెక్ట్ చేయాలి. ముందు చెప్పిన ప్రాసెస్‌లోనే డబ్బులు పంపాలి. అయితే అవతలివాళ్లు కూడా వాట్సప్ పేమెంట్స్ సెటప్ చేసుకుంటేనే డబ్బులు పంపడానికి వీలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)