BSNL Cheapest Plan : BSNL కస్టమర్లకు శుభవార్త.. రూ.49కే గొప్ప ఆఫర్
BSNL Cheapest Plan : BSNL కస్టమర్లకు శుభవార్త.. రూ.49కే గొప్ప ఆఫర్
BSNL Cheapest Plan : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL తన వినియోగదారులకు శుభవార్త అందించింది. అతి తక్కువ ధరతో కస్టమర్లు రీఛార్జ్ చేయడానికి బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. దీని గురించి సమాచారాన్ని ఇక్కడ చూడండి.
భారతదేశంలో మొబైల్ ఫోన్ వినియోగం గతంలో కంటే ఎక్కువగా ఉన్నందున, ఇంటర్నెట్ వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. దాంతో టెలికం కంపెనీలు తమ కస్టమర్లకు సరికొత్త ప్లాన్లను అందిస్తున్నాయి. వినియోగదారులు ఇప్పుడు తమకు వీలైన విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.`
2/ 7
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కస్టమర్లకు ఇటువంటి ప్లాన్లను అందిస్తోంది. ఈ చీప్ & బెస్ట్ ప్లాన్ ధర కేవలం 50 రూపాయలు అంటే మీరు నమ్మలేకపోవచ్చు.
3/ 7
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు కేవలం రూ.49 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL నుంచి ఈ ప్లాన్ వ్యవధి 20 రోజులు. ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లు ఉచిత కాలింగ్, డేటా సౌకర్యాల్ని పొందవచ్చు.
4/ 7
రూ.49 ప్లాన్‌లో 1GB డేటా లభిస్తుంది. దీంతో పాటు 100 నిమిషాల లోకల్, STD వాయిస్ కాలింగ్ పొందవచ్చు.
5/ 7
రూ.29 ప్లాన్ కూడా ఉంది. రూ.49 కాకుండా BSNL తన వినియోగదారులకు రూ.29కి ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 5 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. ఇందులో 1 జీబీ డేటా, ఉచిత కాల్ సౌకర్యం కూడా ఉంది.
6/ 7
ఇప్పుడు BSNL తన 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది జనవరి నుంచి ప్రారంభం కావచ్చు. 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ టీసీఎస్‌కు టెండర్ వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
7/ 7
TCSకి వచ్చే 2 నుంచి 3 రోజుల్లో టెండర్‌కు అనుమతి లభించవచ్చు. దాదాపు లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీకి ఆర్డర్ వస్తుందని చెబుతున్నారు.