2. 'సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 2021 మార్చి 6న టూర్ ప్రారంభమవుతుంది. ఫ్లైట్‌లో టూర్ తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.23,300. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.24,200, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,400 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఆర్సీటీసీ 'సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' టూర్ మార్చి 6న ప్రారంభం అవుతుంది. ఉదయం 5.55 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.55 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్తారు. రాత్రికి అహ్మదాబాద్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మార్చి 8న ఉదయం ద్వారక నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమ్‌నాథ్‌కు తీసుకెళ్తారు. సోమనాథ ఆలయం సందర్శించిన తర్వాత రాత్రికి సోమనాథ్‌లో బస చేయాలి. మార్చి 9న సోమనాథ్ నుంచి పోర్బందర్కు బయల్దేరాలి. పోర్బందర్లో కృతి మందిర్, ఇతర ఆలయాలు సందర్ఛించొచ్చు. రాత్రికి పోర్బందర్లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)