2. సాలరీ స్లిప్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే అందులోనే అనేక మినహాయింపులు లభిస్తాయి. ఇంటి అద్దె అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA), డియర్నెస్ అలవెన్స్ (DA), మెడికల్ అలవెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ లాంటివి భారతదేశంలో పలు సంస్థలు తమ ఉద్యోగులకు సాధారణంగా ఇచ్చే కొన్ని అలవెన్సులు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వీటన్నింటిపై మీరు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కొంత మేరకు పన్ను తగ్గించుకోవచ్చు. ఈ అలవెన్సులపై మినహాయింపును క్లెయిమ్ చేసే ముందు ఓ విషయం గుర్తుంచుకోండి. ఇవన్నీ మీ సీటీసీలో భాగంగా ఉండాలి. లేకపోతే మీరు మినహాయింపును క్లెయిమ్ చేయలేరు. ఇచ్చిన మినహాయింపులో మీరు ఎంత ఖర్చు చేస్తే అంతే మినహాయింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇందుకు సంబంధించి రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు అద్దె చెల్లించినట్టు ప్రూఫ్ జత చేయాలి. అప్పుడే మీరు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు పొందుతారు. అదేవిధంగా, మీరు పిల్లల చదువు, వారి హాస్టల్ ఖర్చులు, ప్రయాణ భత్యం, రకాల అలవెన్సులు క్లెయిమ్ చేసుకొని పన్ను ఆదా చేయాలనుకున్నా, కోసం రుజువులు సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. పైన చెప్పినట్టుగా, భత్యాలపై మినహాయింపు రుజువు ఉంటేనే మీరు క్లెయిమ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. అందుకే మీరు చేసిన ఖర్చుల రిసిప్ట్స్, బిల్లు మీ దగ్గర ఉండటం ముఖ్యం. మీరు చేసిన క్లెయిమ్‌లను ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడైనా పరిశోధిస్తే, మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అందుకే చూపించడానికి ఈ రుజువులన్నీ తప్పనిసరిగా మీ దగ్గర ఉంటే ఇబ్బంది ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీరు మీ సొంతగా ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చేయలేకపోయినా, మినహాయింపు కోసం అవసరమైన ఖర్చులను చేయలేకపోతున్నా, ఖర్చు చేసినవాటికి ఎలా మినహాయింపు పొందాలో అవగాహన లేకపోయినా ప్రొఫెషనల్ ట్యాక్స్ అడ్వైజర్ సలహా తీసుకోవాలి. అప్పుడే మీరు ఏ అలవెన్స్ పైన అయినా పన్ను మినహాయింపులు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)