2. లోన్ కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా అధికారిక వెబ్సైట్లోనే రుణ పునర్నిర్మాణం కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం ఎస్బీఐ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఇప్పటికే రీటైల్ రుణగ్రహీతలకు రెండు సార్లు మొత్తం ఆరు నెలలు మారటోరియం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4. హోమ్ పేజీలో Relief to Retail Borrowers from Covid 19 Stress పేరుతో బ్యానర్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కస్టమర్లు నేరుగా
https://digivoucher.sbi.co.in/EMIRestruct/EMI_CustomerLogin.jsp లింక్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత Loan Account Number ఎంటర్ చేసి Generate OTP పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోన్ కస్టమర్లు రుణ పునర్నిర్మాణ అవకాశాన్ని ఇస్తోంది ఎస్బీఐ. 2020 ఫిబ్రవరితో పోలిస్తే 2020 ఆగస్టులో వేతనం లేదా ఆదాయం తగ్గినవారికి మాత్రమే ఈ అవకాశం. అంటే లాక్డౌన్ కాలంలో వేతనం తగ్గినా, పూర్తిగా ఆగిపోయినా, ఉద్యోగం కోల్పోయినా, వ్యాపారాలు మూతపడ్డా లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రీస్ట్రక్చర్ చేస్తుంది ఎస్బీఐ. మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మారటోరియం కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. 2020 మార్చి 1 తర్వాత రుణాలు తీసుకున్నవారికి ఈ అవకాశం లేదు. ఇక ఎప్పట్లాగే వేతనం, ఆదాయం వస్తున్నవారు కూడా రుణాలను పునర్నిర్మించుకోలేరు. లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 24 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)