1. ఒకప్పుడు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు ప్లాట్ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ట్రైన్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత తమ స్మార్ట్ఫోన్లోనే ట్రైన్ లైవ్ లొకేషన్ (Train Live Location) తెలుసుకోగలుగుతున్నారు. రైలు ఎక్కడ ఉందో తెలిపే యాప్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే ఇలా యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర పేటీఎం (Paytm) యాప్ ఉంటే అందులోనే రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. పేటీఎం కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఇది. పేటీఎం మొబైల్ యాప్, వెబ్సైట్లో లైవ్ ట్రైన్ స్టేటస్ (Live Train Status) ఫీచర్ అందిస్తోంది. మరి ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. పేటీఎం యాప్లో లైవ్ ట్రైన్ స్టేటస్ తెలుసుకోవడానికి ముందుగా మీ ఫోన్లో పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. ట్రావెల్ సెక్షన్లో ట్రైన్స్ క్లిక్ చేయండి. అందులో ట్రైన్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత రైలు నెంబర్ లేదా రైలు పేరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా పేటీఎం వెబ్సైట్ ఓపెన్ చేయండి. ట్రావెల్ సెక్షన్లో ట్రైన్స్ క్లిక్ చేయండి. అందులో లైవ్ ట్రైన్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. రైలు నెంబర్ లేదా రైలు పేరు, బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత డేట్ సెలెక్ట్ చేసి Check Live Status పైన క్లిక్ చేయండి. వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇప్పటికే పేటీఎంలో పీఎన్ఆర్ చెక్ చేసే ఫీచర్ అందుబాటులో ఉంది. పేటీఎం యాప్ నుంచే రైలులో కావాల్సిన ఫుడ్ కూడా ఆర్డర్ చేయొచ్చు. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యాప్ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ, గుజరాతీ, మళయాళం, పంజాబీ, ఒడియా లాంటి భాషల్లో అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)