2. పీఎం కిసాన్, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి పథకాలకు చెందిన డబ్బుల్ని ప్రభుత్వం జన్ ధన్ ఖాతాల్లోకే ట్రాన్స్ఫర్ చేస్తుంది. జన్ ధన్ ఖాతా ఉంటే ప్రభుత్వ పథకాలు పొందడం సులువవుతుంది. పథకాలు మాత్రమే కాదు రుణాలు, సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, పెన్షన్ లాంటివాటికి కూడా జన్ ధన్ అకౌంట్ అవసరమే. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముందుగా మీరు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి ఐడీ, అడ్రస్ ప్రూఫ్స్ జత చేయాలి. ఆ దరఖాస్తు ఫామ్‌ను సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌లో సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాదారులకు ఉచితంగా బేసిక్ రూపే కార్డును జారీ చేస్తుంది బ్యాంకు. ఏ బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. డబ్బులు డిపాజిట్ చేయడానికి లిమిట్ లేదు. నెలకు నాలుగు సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు విత్‌డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)