1. పర్సనల్ లోన్... ఏ అవసరం వెంటనే గుర్తొచ్చే లోన్ ప్రొడక్ట్ ఇది. బ్యాంకులు కూడా పర్సనల్ లోన్ (Bank Loan) ఇచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు (Personal Loan Interest Rates) ఎక్కువగా ఉంటాయి కాబట్టి రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతుంటాయి. గతంలో పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
2. లోన్ కోసం బ్యాంకుకు వెళ్లడం, అప్లికేషన్ సబ్మిట్ చేయడం, బ్యాంకు సిబ్బంది అప్లికేషన్ పరిశీలించడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయడం, అన్నీ సరిగ్గా ఉన్నాయంటే వారం రోజుల తర్వాత అకౌంట్లో డబ్బులు వేయడం... ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండువారాల సమయం పట్టేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత నిమిషాల్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కొద్ది రోజుల క్రితం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాట్సప్‌లో అప్లై చేస్తే చాలు రెండు నిమిషాల్లో హోమ్ లోన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు మరో ఫైనాన్స్ కంపెనీ క్యాష్ఈ (CASHe) కేవలం 30 సెకండ్లలో లోన్స్ ఇస్తామని చెబుతోంది. ఇందుకోసం వాట్సప్ యూజర్లు చేయాల్సింది Hi అని టైప్ చేసి పంపడమే. (ప్రతీకాత్మక చిత్రం)
4. వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం క్యాష్ఈ ఈ ఆఫర్ ఇస్తోంది. వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఉన్నవారు వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్ మంజూరవుతుంది. డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫామ్స్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ పొందడానికి మొబైల్ యాప్స్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన పనిలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కస్టమర్ల ప్రొఫైల్ విశ్లేషించి కేవలం 30 సెకండ్లలో లోన్ మంజూరు చేస్తుంది క్యాష్ఈ సంస్థ. ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండదు. వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది. ఆ తర్వాత మీకు క్రెడిట్ లైన్ ద్వారా ఎంత రుణం లభిస్తుందో వివరాలు తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)