1. కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? హోమ్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? కేవలం రెండు నిమిషాల్లో హోమ్ లోన్ (Home Loan) మంజూరు చేస్తోంది హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (HDFC Limited). అది కూడా వాట్సప్ ద్వారా హోమ్ లోన్ మంజూరు చేస్తోంది. ఇందుకోసం హెచ్డీఎఫ్సీ స్పాట్ ఆఫర్ ఆన్ వాట్సప్ (Spot Offer on WhatsApp) పేరుతో కొత్త సర్వీస్‌ను ఇటీవల ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. స్పాట్ ఆఫర్లో భాగంగా హోమ్ లోన్ కస్టమర్లకు కేవలం రెండు నిమిషాల్లో వాట్సప్‌లో ఇన్ ప్రిన్సిపల్ హోమ్ లోన్ మంజూరు చేస్తోంది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లు బ్యాంకుల చుట్టూ, ఫైనాన్సింగ్ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లో హోమ్ లోన్‌కు అప్లై చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా +91 9867000000 ఫోన్ నెంబర్ సేవ్ చేయాలి. వాట్సప్‌లో ఈ నెంబర్ ఓపెన్ చేసి Hi అని టైప్ చేయాలి. ఆ తర్వాత కొన్ని క్లిక్స్తో మీ బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తుంది హెచ్డీఎఫ్సీ. ఆ తర్వాత ప్రొవిజినల్ హోమ్ లోన్ ఆఫర్ లెటర్ జారీ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. హెచ్డీఎఫ్సీ స్పాట్ ఆఫర్ ఆన్ వాట్సప్ సదుపాయాన్ని 24 గంటలు ఉపయోగించవచ్చు. హోమ్ లోన్ అప్రూవల్ లెటర్ పొందడానికి ఎక్కువ సమయం వేచిచూడాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నిమిషాల్లో హోమ్ లోన్ అప్రూవల్ లెటర్ లభిస్తుంది. భారతదేశంలో వేతనం తీసుకుంటున్న ఉద్యోగులకు మాత్రమే ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. కొత్తగా ఇళ్లు, ఫ్లాట్లు తీసుకుంటున్నవారు పెరుగుతున్నారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా లోన్ మంజూరు చేసే సమయాన్ని వేగవంతం చేస్తోంది హెచ్డీఎఫ్సీ. అందులో భాగంగా కొత్త సదుపాయం ప్రారంభించింది. కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారితో పాటు ఉన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి వెళ్లాలనుకునేవారికి లోన్లు ఇస్తోంది హెచ్డీఎఫ్సీ. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ 7 శాతం వడ్డీకే హోమ్ లోన్స్ ఇస్తోంది. కస్టమర్లు అందరికీ డిజిటల్ పద్ధతిలో రుణాలు మంజూరు చేస్తోంది. 91 శాతం కొత్త లోన్ అప్లికేషన్స్ డిజిటల్ పద్ధతిలోనే ప్రాసెస్ చేస్తుండటం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి కన్నా ముందు డిజిటల్ అప్లికేషన్స్ 20 శాతం కన్నా తక్కువే ఉండేవి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల రీటైల్ హోమ్ లోన్స్ ఇచ్చి రికార్డు సృష్టించింది హెచ్డీఎఫ్సీ. (ప్రతీకాత్మక చిత్రం)