ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకునే బిజినెస్ కస్టమర్లకు అవసరమైనప్పుడు డబ్బు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ-కామర్స్ కంపెనీలు కొత్త క్రెడిట్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నాయి. వీటిలో ‘బై నౌ పే లేటర్’ (BNPL) ఆప్షన్ పాపులర్ అయింది. తాజాగా ఆన్లైన్ బిజినెస్ పోర్టల్స్ కోసం BNPL ఆప్షన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది పేమెంట్స్ అండ్ API బ్యాంకింగ్ సొల్యూషన్స్ కంపెనీ ‘క్యాష్‌ఫ్రీ పేమెంట్స్’(Cashfree Payments). దీని ద్వారా కార్డ్‌లెస్ EMI అండ్ కార్డ్ బేస్డ్ EMI విధానంలో కస్టమర్లకు 30కి పైగా ఫ్లెగ్జిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
* బై నౌ పే లేటర్:
బై నౌ పే లేటర్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్ కంపెనీలు తమ కస్టమర్లకు ఈజీగా క్రెడిట్ ఆప్షన్ అందించవచ్చు. దీని ద్వారా కంపెనీ సేల్స్ పెరుగుతాయని క్యాష్ ఫ్రీ కంపెనీ తెలిపింది. BNPL సదుపాయాన్ని ఉపయోగించుకునే కస్టమర్లకు ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు చెకౌట్ చేసేటప్పుడు 30 రకాల అనువైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించగలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
BNPLను ఉపయోగిస్తున్న 20,000 కంపెనీలు
ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు క్యాష్ ఫ్రీ పేమెంట్స్ అందిస్తున్న BNPLను యూజ్ చేస్తున్నాయి. ఈ ఆప్షన్ అందిస్తున్న ఆన్ లైన్ కంపెనీల సేల్స్ 30 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఈజీ మై ట్రిప్, బైజుస్, వేక్ ఫిట్ లాంటి ఇతర ఆన్ లైన్ లీడింగ్ కంపెనీలు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
'క్యాష్ ఫ్రీ పేమెంట్స్' పేమెంట్స్ గేట్ వే యూజ్ చేస్తున్న ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు ఎటువంటి శ్రమ లేకుండా తమ వెబ్సైట్లో లేదా యాప్ చెక్ ఔట్ పేజ్‌లో BNPL మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు నో కాస్ట్ EMI ఆఫర్ల కోసం స్పెసిఫిక్ బ్యాంకులను, పేమెంట్ పార్ట్నర్లను క్యాష్ ఫ్రీ కంపెనీ డ్యాష్‌బోర్డ్ మీద సెట్ చేసుకోవచ్చు.