Multibagger: ఈ స్టాక్‌తో డబ్బుల వర్షం.. ఒక్క షేరుకు 23 షేర్లు ఉచితం!
Multibagger: ఈ స్టాక్‌తో డబ్బుల వర్షం.. ఒక్క షేరుకు 23 షేర్లు ఉచితం!
Bonus Share | కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. స్టాక్ స్ల్పిట్, బోనస్ షేర్ వంటి వాటిని ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు లభించే అావకాశం ఉంది.
Stock Split | కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ స్ల్పిట్, స్టాక్ బోనస్ వంటివి ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు కలిగిన వారికి ఒక్క షేరుకు 23 షేర్లు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ షేరు ఎంటని ఆలోచిస్తున్నారు. అక్కడికే వస్తున్నాను.
2/ 9
స్మాల్ క్యాప్ కంపెనీ విన్నీ ఓవర్సీస్ కంపెనీ ఈ ప్రకటన చేసింది. కంపెనీ బోర్డు స్టాక్ స్ల్పిట్, షేరు బోనస్‌కు అంగీకారం తెలిపింది. దీంతో కంపెనీ షేర్లు కూడా పరుగులు పెడుతున్నాయి. అప్పర్ సర్క్యూట్ కొడుతున్నాయి.
3/ 9
ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 187 వద్ద ఉంది. సోమవారం రోజున ఈ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ నమోదు చేసింది. టెక్స్టైల్ రంగానికి చెందిన ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 190 కోట్లు. స్టాక్ బోనస్, స్ల్పిట్ కారణంగా షేరు పరుగులు పెడుతోంది.
4/ 9
జనవరి 16న జరిగిన కంపెనీ సమావేశంలో మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 ముఖ విలువ కలిగిన స్టాక్‌ను రూ.1 ముఖ విలువ కలిగిన స్టాక్‌గా మార్చడం. అంటే ఒక్క షేరును పది షేర్లుగా విభజించాలని నిర్ణయించారు.
5/ 9
అలాగే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ. 12,50,00,000 నుంచి రూ. 25,00,00,000కు పెంచాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇంకా బోనస్ షేర్లకు అంగీకారం తెలిపారు. 13: 10 రేషియోలో బోనస్ షేర్లు అందించనుంది.
6/ 9
అంటే కంపెనీ ఒక్క షేరును పది షేర్లుగా విభజించనుంది. స్టాక్ స్ల్పిట్ జరిగితే ఒక్క షేరు ఉన్న వారికి పది షేర్లు వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి 10 షేర్లకు 13 షేర్లను ఉచితంగా బోనస్ షేర్ల కింద అందించనుంది.
7/ 9
ఇకపోతే విన్నీ ఓవర్సీస్ షేరు ఎస్ఎంఈ ఐపీవోకు 2022 నవంబర్ 28న వచ్చింది. అప్పటి నుంచి చూస్తే ఈ షేరు ఏకంగా 525 శాతం మేర ర్యాలీ చేసింది. 2023లో చూస్తే ఈ షేరు 27 శాతానికి పైగా పరుగులు పెట్టింది.
8/ 9
కాగా స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టాలని భావించే వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెట్టిన డబ్బులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు బాగా పెరిగే షేరు సడన్‌గా పతనం కావొచ్చు.
9/ 9
అందుకే అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పెట్టిన డబ్బులను కూడా వెనక్కి పొందలేకపోవచ్చు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోండి. రిస్క్ ఉన్న చోటే లాభం కూడా ఉంటుంది.